- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chiranjeevi: ఆ స్టార్ డైరెక్టర్‌తో కొత్త సినిమాకు ఓకే చేసిన మెగాస్టార్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

దిశ, సినిమా: ‘సార్’(Sir), ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన వెంకీ అట్లూరి(Venky Atluri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన హీరో ధనుష్(Dhanush)తో ‘హానెస్ట్ రాజ్’(Honest Raj) అనే మూవీని చేస్తున్నాడు. అలాగే నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ(Mokshagna)తో కూడా వెంకీ అట్లూరి సినిమా ఉంటుందని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’(Vishwambhara) మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే చిరు.. ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరిని పిలిచి, తనతో ఇలాంటి సినిమా చేయాలని కోరాడట. ఇక మెగాస్టార్ నుంచి ఇలాంటి ఆఫర్ వచ్చేసరికి షాక్ అయిన వెంకీ.. ‘నాకు నెక్స్ట్ ఇయర్ టైమ్ ఇస్తే, మీకు సరిపోయే విధంగా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వస్తాను’ అని చెప్పాడట. ఈ విషయాన్ని నాగ వంశీ(Naga Vamshi) ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. మరి వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో స్క్రీన్ మీదే చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.