Chiranjeevi: హీరోలు బాగానే ఉంటారు.. ఫ్యాన్సే కొట్టుకుంటారు.. మెగాస్టార్ హాట్ కామెంట్స్

by Kavitha |
Chiranjeevi: హీరోలు బాగానే ఉంటారు.. ఫ్యాన్సే కొట్టుకుంటారు.. మెగాస్టార్ హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడంతో తాజాగా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మూవీ టీమ్. ఇక దీనికి గెస్ట్‌గా వచ్చిన మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోల ఫ్యాన్స్‌ను ఉద్ధేశించి ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇలాంటి ఫంక్షన్స్‌కు వస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి నువ్వు వెళ్తున్నావా.. అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ(Balakrishna) కాంపౌండ్.. అప్పుడప్పుడు తారక్ అంటాడు.. అంటూ కొన్ని మాటలు వినిపించాయి. నేను ఒకటే చెప్పా.. మనుషులన్నాక వేరే వాళ్ల మీద ప్రేమ, అభిమానం ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా?

ఫర్ ఎగ్జాంపుల్.. మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్‌కు నేను వెళ్లకూడదా? వాడితో కలిసి ఉండకూడదా? కలిసి భోజనం చేయకూడదా? వాడిని నేను దూరంగా పెడతానా?.. మొన్న విశ్వక్ సేన్‌ని ఇలానే ఎవరో అడిగారు. ఆ క్లిప్ నేను చూశాను. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా.. మెగా కాంపౌండ్‌లోకి వెళ్తున్నారేంటి అని అడిగారు. దానికి విశ్వక్ సేన్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదని విశ్వక్ సేన్ చాలా చక్కగా చెప్పాడు.

నా చిన్ననాటి రోజుల నుంచి ఆ కాంపౌండ్ల గోల ఉంది. కానీ అది షూటింగ్‌ల వరకే.. హీరోలంతా బాగానే ఉంటారు. కానీ అభిమానులే కొట్టుకు చచ్చే వాళ్లు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ.. మేమంతా కలుసుకుంటూనే ఉంటాం. అభిమానం అనేది పర్సనల్. మన మనిషి కాదని దూరం పెట్టడం కరెక్ట్ కాదు. హీరోలంతా ఒక్కటే, అందరూ ఇండస్ట్రీలో భాగమే అని మేసేజ్‌ని స్ప్రెడ్ చేయాలి. మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలంటే మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప.. మనల్ని మనం దూరం చేసుకోవడం కాదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed