- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Revanth: చిన్న వయసులోనే అలాంటి పని చేసి అందరికీ స్ఫూర్తినిచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చైల్డ్ ఆర్టిస్ట్ (వీడియో)

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లోకి వచ్చి భారీ కలెక్షన్లు రాబడుతోంది. దీంతో ఇందులో నటించిన నటీనటులు వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ బిజీ అయిపోయారు. ముఖ్యంగా ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన బుల్లి రాజు అలియాస్ రేవంత్(Revanth) మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడనే చెప్పాలి.
తన మాటలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే విధంగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మొత్తానికి బుల్లి రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయానడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, బుల్లి రాజు ఓ మంచి పని చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీ లో మొక్కలు నాటాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read More..