‘చత్రపతి శివాజీ మహారాజ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన స్టార్ హీరో (ట్వీట్)

by Hamsa |
‘చత్రపతి శివాజీ మహారాజ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన స్టార్ హీరో (ట్వీట్)
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ 2022లో థియేటర్స్‌లో విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ వచ్చింది. దీంతో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతర పార్ట్-1’(Kantara Part-1)లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే రిషబ్ శెట్టి తెలుగులో ‘జై హనుమాన్’(Jai Hanuman) సినిమాలో హనుమంతుడిగా నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, మరో కొత్త చిత్రాన్ని ప్రకటించడంతో పాటు డబుల్ అప్డేట్ విడుదల చేశారు. ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: చత్రపతి శివాజీ మహారాజ్’(Chhatrapati Shivaji Maharaj) మూవీకి సంబంధించిన తన ఫస్ట్ లుక్‌‌(First Look)ను షేర్ చేయడంతో పాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు. ఈ పోస్టర్‌లో రిషబ్ శెట్టి కత్తి పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు. అయితే ఈ మూవీ 2027 జనవరి 21న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది.

ఇది కేవలం సినిమా మాత్రమే కాదు అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తివంతమైన వ్యక్తి చరిత్ర. ఇలాంటి యోధుడి చరిత్రను మూవీగా తీసుకురావాలనేది గొప్ప ఆలోచన. ఈ యాక్షన్ డ్రామా కోసం సిద్ధంగా ఉండండి. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసమే కాదు.. శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను తెలుసుకోవడానికి రెడీగా ఉండండి’’ అని రాసుకొచ్చారు.అయితే సందీప్ సింగ్(Sandeep Singh) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా రాబోతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed