- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahasyam Idam Jagat : ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం.. చందు మొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్(Science fiction and mythological thrillers)గా రూపొందిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్’(Rasyaam Idam Jagat). పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉన్నాయని తెలుస్తుండగా.. ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇక పాజిటివ్ అంచనాల మధ్య నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ చందు మొండేటి (Chandu mondeti) విడుదల చేశారు. ఈ సందర్భంగా చందు మొండేటి మాట్లాడుతూ.. ‘ఈ టీజర్ చూసి ఎగ్జైట్ ఫీలయ్యాను. పర్టిక్యులర్‌గా, పర్సనల్‌గా నేను వేటికి అయితే ఎక్కువగా ఎగ్జైట్ అవుతానో, కనెక్ట్ అవుతానో.. చదువుతానో, రిసెర్చ్ చేస్తానో.. వాటికి సిమిలర్‌గా ఈ సినిమా కాన్సెప్ట్ ఉండటంతో ఎగ్జైట్ అయ్యాను.
ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం. ఐ థింగ్ సో.. ఎనీ థింగ్ రిలేటెడ్ సైన్స్.. జనాలు ఇలాంటి సినిమాలు చూసే మూడ్‌లో ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. అందరికి ఆల్ ది బెస్ట్’ అని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ మూవీలో రాకేష్ గలేబి(Rakesh Galebi), స్రవంతి పత్తిపాటి(Sravanti Pattipati), మానస వీణ (Manasa veena), భార్గవ్ గోపీనాథం (Bhargav Gopinath) ప్రధాన పాత్రల్లో నట్టిస్తున్నారు. కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం(Directer Komal R Bharadwaj) వహిస్తున్న ‘రహస్యం ఇదం జగత్’ సినిమాని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై పద్మ రావినూతుల (Padma Ravinutula), హిరణ్య రావినూతుల (Hiranya Ravinutula) నిర్మిస్తున్నారు.