- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya- Shobhita : నాగ చైతన్య, శోభిత పెళ్లి ఆ దేశంలోనే.. వారం రోజుల పాటు పెళ్లి సందడి..? ట్విస్ట్ మాములుగా లేదుగా!
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడనే పుకార్లను నిజం చేస్తూ రీసెంట్‌గా ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున వీరిద్దరి ఫొటోలను షేర్ చేస్తూ X వేదికగా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో వీరు ఫుల్ హాట్‌టాపిక్ అయ్యారు. ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడని సంతోష పడుతుంటే.. సమంత ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరిపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. నిశ్చితార్థం తర్వాత అక్కినేని ఫ్యాన్స్ చైతన్య శోభిత పెళ్లి ఎప్పుడెప్పుడు చేసుకుంటారా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. కొంత మంది కుటుంబ సభ్యుల నడుమ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య, శోభితలు.. పెళ్లి మాత్రం పారీస్‌లో అట్టహాసంగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. అలాగే వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు జరగనున్నాయని ఇన్‌సైడ్ వర్గాల టాక్. ఇక గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత, నాగ్ చైతన్య, శోభిత హైదరాబాద్‌లో తమ స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. అయితే గతంలో నాగార్జున పారిస్ అంటే చాలా ఇష్టం అని చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జునకి ఫేవరెట్ ప్లేస్ కావడంతో నాగచైతన్య శోభిత వారి పెళ్లి ఆ దేశంలో చేసుకోబోతున్నారట. కాగా ఈ పెళ్లిపై ఇప్పటి వరకు ఇరు కుటుంబాల నుంచి కానీ, ఈ ఇద్దరి నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. మరి ఇదంతా నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.