- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : ఇంట్లో వాళ్ళ మీద ఫైర్ అయిన రుద్రాణీ
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
‘నేను కూడా ఈ ఇంటి బిడ్డనే.. ఆడపిల్లకు హక్కు ఉందని నాన్నే చెప్పాడు. మీరంతా నన్ను తిడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను.. ధాన్యలక్ష్మి అడుగుతున్నట్లు నాకు రావాల్సిన ఆస్తి కావాల్సిందే.. నా కొడుక్కి, నాకు పుట్టబోయే మనవడికి కూడా రావాల్సిన ఆస్తిని పంచాల్సిందే.. మీరు మీరు పంచుకుని, నాకు ఇవ్వను అంటే నేను ఎలా ఊరుకుంటా.. మీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు' అని చెబుతుంది. ఇప్పటి వరకు రుద్రాణీ ఎక్కడా ఫైర్ అవ్వలేదు .. ఇప్పుడు ఎలా అయిన ఆస్తి తీసుకునే వరకు వదిలేలా లేదు. డైరెక్టర్ గారు రుద్రాణీకి సూపర్ పవర్స్ ఇచ్చినట్టు ఉన్నారు.. ఆమె ఒకసారి ఫైర్ అవ్వడం మొదలుపెడితే ఎవ్వరూ కూడా ఆమెను ఆపలేరు.
ఇక ధాన్యం కూడా అందుకుని వారిని కడిగిపారేస్తుంది. ‘నువ్వు ఆగు రుద్రాణీ.. వీళ్ళ సంగతి నేను చెబుతా .. నా మొగుడ్ని అమాయకుడ్ని చేసి.. ఏమి ఇవ్వకుండా చూడాలని అనుకుంటున్నారు.. నేను అసలు ఊరుకోను .. ఆస్తి ముక్కలు చేసి మాకు రావాల్సిన వాటా కళ్యాణ్‌కి ఇవ్వాల్సిందే’ అని ఫైర్ అవుతుంది. ఇదంతా చూస్తున్న ఇందిరా దేవికి ఏమి చేయాలో తెలియక తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఇక ప్రకాశం, ధాన్యం దగ్గరకు వెళ్లి నోరుమూయించాలని ప్రయత్నిస్తాడు. అయినా కూడా అరుస్తూనే ఉంటుంది. అప్పుడు సుభాష్ ‘సరే అందరికీ ఆస్తిని పంచేస్తాను .. కలిసి ఉండాలని మీకు లేనప్పుడు మిమ్మల్ని వదిలించుకోవడమే నాకు నయం.. అని అంటాడు సుభాష్. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.