- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ హీరోయిన్‌తో శ్రీదేవి సినిమాకు సీక్వెల్.. బోనీ కపూర్ కీలక ప్రకటన

దిశ, సినిమా: అలనాటి అందాల తార, అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందరికీ సుపరిచితమే. దాదాపు అన్ని భాషల్లో శ్రీదేవి సక్సెస్ అందుకుని అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణించింది. ఇప్పుడు శ్రీదేవి వారసత్వంగా తన ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. జాన్వీ కపూర్ అటూ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇక ఖుషీ కపూర్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది.
ఇప్పటికే ‘ఆర్చీస్’, ‘లవ్ యాపా’ల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తన తల్లి శ్రీదేవి చివరిసారిగా తెరపై కనిపించిన చిత్రం సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఐఫా వేడుకలలో భాగంగా అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ.. ‘శ్రీదేవి నటించిన చిత్రం ‘మామ్’కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఖుషీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు నేను చూశాను. చాలా అద్భుతంగా నటించింది. తనతో నేను త్వరలో సినిమా చేస్తా.. అది ‘మామ్ 2’ కావొచ్చు’ అని చెప్పుకొచ్చారు.
ఇక శ్రీదేవి చివరిసారిగా నటించిన చిత్రం ‘మామ్’. రవి ఉద్యావర్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించాడు. హిందీతో పాటు తెలుగులో రిలీజైన ‘మామ్’ సినిమా మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మామ్ 2’ తెరకెక్కించడం, అలాగే అందులో శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ లీడ్ రోల్‌లో యాక్ట్ చేస్తుంది అనడంతో నెటిజన్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.