Fauji : ఫౌజీ‌ సెట్స్‌లో బాలీవుడ్ స్టార్ నటుడు.. ప్రభాస్‌తో ఉన్న ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2025-02-14 13:46:31.0  )
Fauji : ఫౌజీ‌ సెట్స్‌లో బాలీవుడ్ స్టార్ నటుడు.. ప్రభాస్‌తో ఉన్న ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapoodi) కాంబినేషన్‌లో ఓ మోస్ట్ వెయిటెడ్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్(Anupam Kher) కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫౌజీ (Fauji)సెట్స్‌లో నుంచి ప్రభాస్ అండ్ టీమ్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ‘నా 544వ సినిమా ఇండియ‌న్ సినిమాకు బాహుబ‌లి(Bahubali) అయిన ప్రభాస్‌తో చేస్తున్నాను. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. అలాగే నా స్నేహితుడు బ్రిలియంట్ కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ ఈ సినిమాకు డీవోపీగా చేస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన కథ. జీవితంలో ఇంకేం కావాలి’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన అనుప‌మ్ ఖేర్ పోస్ట్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా.. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి ఈ సినిమా మిమ్మల్నీ తీసుకెళ్తుంది.. ప్రేక్షకులు చాలా సర్‌ప్రైజ్ ఫీల్ అవుతారు అంటూ గతంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఈ మూవీపై భారీ అంచనాలకు క్రియేట్ చేశాయి.

Next Story

Most Viewed