Kangana Ranaut: బాలీవుడ్ చిత్రాల్లో వివాహ వ్యవస్థను తప్పుగా చూపిస్తున్నారు.. కంగనా సెన్సేషనల్ పోస్ట్

by Hamsa |
Kangana Ranaut: బాలీవుడ్ చిత్రాల్లో వివాహ వ్యవస్థను తప్పుగా చూపిస్తున్నారు.. కంగనా సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఇటీవల ‘ఎమర్జెన్సీ’(Emergency) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ వివాదాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.. కానీ హిట్ సాధించలేకపోయింది. ఇక ‘ఎమర్జెన్సీ’ మార్చి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే కంగనా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, కంగనా బాలీవుడ్ సినిమాలపై సంచలన పోస్ట్ పెట్టింది. ‘‘బాలీవుడ్‌లో వచ్చే ప్రేమకథా చిత్రాలు వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తగ్గించేలా చిత్రీకరిస్తున్నారు. అయితే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దల గురించి చెప్పాలంటే.. వారు కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇస్తారు.

ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తుంటారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. జీవితం చాలా చిన్నది. మన బాధ్యతలను మనం సంక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోవాలి.. కానీ గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేస్తే ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. విజయం, సంపద, వివాహం మానవుడిని సంతృప్తి పరచగలవని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఐక్యంగా ఉండటం వల్లనే ఆనందం ఉంటుంది. అయితే మన ఉమ్మడి కుటుంబాలు, ఆచరించవద్దు, విడాకులు ప్రోత్సహించ వద్దు. వాటిని యువత వదిలేయాలి. నేను ఎప్పుడూ పెరుగుతున్న స్ట్రీని చూడలేదు. అమ్మ, నాన్నమ్మ అంతిమ రాణులు వారిలాగే ఉండాలని మేము ఆశిస్తున్నాము. అయితే స్త్రీల విలువను తగ్గించే సందర్భాలెన్నో చూశాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం కంగనా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story