Ashwini Sri : కంటెస్టెంట్ అశ్వినికి పెళ్ళై విడాకులయ్యాయా..?

by Hamsa |   ( Updated:2023-11-11 05:24:13.0  )
Ashwini Sri : కంటెస్టెంట్ అశ్వినికి పెళ్ళై విడాకులయ్యాయా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ షో పదో వారం కొనసాగుతుంది. అయితే ఇందులో ఇటీవల వైల్డ్ కార్డ్ ద్వారా నటి అశ్విని శ్రీ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు టాస్కులు ఆడుతూ తనదైన ఆటను చూపిస్తుంది. ఇదిలా ఉంటే ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అసలు అశ్విని ఎవరూ ఏ సినిమాల్లో నటించిందో ఇక్కడ తెలుసుకుందాం. బీటెక్ పూర్తి చేసి జాబ్ చేద్దాం అనుకునే సమయంలో ఫ్రెండ్స్ అందరూ హీరోయిన్ లా ఉన్నావు సినిమాల్లో ట్రై చెయ్ అని చెప్పడంతో ఇంట్లో వాళ్లకి అశ్విని ఈ విషయం చెప్పిందట. కానీ ఇండస్ట్రీ గురించి అంతా తెలిసి అశ్విని పేరెంట్స్ దీనికి ఒప్పుకోలేదట. కానీ పట్టుబట్టి ఇండస్ట్రీ లోకి వెళ్ళాలి అని అశ్విని ఎంతగానో ట్రై చేసి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.

ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్నకి అక్క పాత్రలో చేసింది. అలాగే రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో ఒక పాటలో అశ్విని కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత అమీర్ పేట్ లో,బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి చిన్న సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా అంత సక్సెస్ కాకపోవడంతో అశ్విని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది. అలా కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల నెట్టింట్లో ఫేమస్ అయి బిగ్ బాస్ 7 హౌస్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, అశ్వినికి సంబంధించిన ఓ షాకింగ్ వార్త నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఆమె తల్లిదండ్రులు ఇండస్ట్రీ లోకి వెళ్తే ఏం జరుగుతుందో అని భయపడిపోయిన అశ్విని పేరెంట్స్ 2013లోనే పెళ్లి చేశారని, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అశ్విని భర్తతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేక అతనికి విడాకులు ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ చూస్తున్న ప్రేక్షకుల మాత్రం ఆమెకు పెళ్లి కాలేదని భావిస్తున్నారు.

Advertisement

Next Story