ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఒక్కటి కాబోతున్న ప్రభాస్ అనుష్క.. ముహూర్తం కూడా ఫిక్స్!

by Hamsa |   ( Updated:2024-03-23 08:39:02.0  )
ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఒక్కటి కాబోతున్న ప్రభాస్ అనుష్క.. ముహూర్తం కూడా ఫిక్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుని అదే ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. అంతేకాకుండా అందరి మెప్పు పొందడంతో పాటుగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత నటించిన రెండు మూడు చిత్రాలు హిట్ అందుకోలేకపోయాయి. కానీ గత ఏడాది విడుదలైన సలార్ మూవీ మాత్రం బాక్సాఫీసు వద్ద భారీగా విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం డార్లింగ్ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పుడు కల్కి ఏడి 2898, సలార్-2, రాజాసాబ్, స్పిరిట్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే స్పిరిట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతుండటంతో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. స్పిరిట్‌కు సంబంధించిన టైటిల్ ప్రకటించి చాలా రోజులవుతన్నప్పటికీ దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ కాలేదు.

దానికి కారణం ప్రభాస్, సందీప్ ఇతర సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల పూజాకార్యక్రమాలు కూడా మొదలు కానప్పటికీ అన్నింటినీ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తొందరలో ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, స్పిరిట్ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్వీటీ దగ్గరకు వెళ్లి కథను కూడా వినిపించాడట. దీంతో అనుష్క కూడా ప్రభాస్‌తో మరోసారి నటించేందుకు రెడీ అయినట్లు టాక్. అలాగే స్పిరిట్‌ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరలో స్టార్ట్ చేసేందుకు మూహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నారు. కాగా, అనుష్క, ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అయితే ప్రభాస్- అనుష్క గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. వాటిపై వీరిద్దరు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వార్తలు ఆగడం లేదు. ఇప్పటికే వారికి సంబంధించిన వార్త లెన్నో వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీలో అనుష్కను ఫిక్స్ చేశారని వార్తలు రావడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవడం పక్కా అని నెట్టింట చర్చలు మొదలెట్టారు.

Advertisement

Next Story