- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RobinHood: శ్రీలీల ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. రాబిన్‌హుడ్ ట్రైలర్-విడుదల తేదీ ఖరారు

దిశ, వెబ్‌డెస్క్: వెంకీ కుడుములు(Venky kuḍumulu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్‌హుడ్ (Robinhood) మూవీ కోసం జనాలు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గతంలో కూడా నితిన్(Nitin)కు భీష్మ (Bhishma) వంటి సూపర్ హిట్లు అందించిన ఈ దర్శకుడితో మరోసారి జతకట్టడంలో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది.
ఇక హీరో నితిన్ సరసన టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల (Sensational heroine Sreeleela) కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ (The famous production company is Mythri Movies) నిర్మించిగా.. జీవీ ప్రకాష్ (G.V. Prakash) సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్లు(Teasers), ట్రైలర్లు (Trailers) ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే రాబిన్‌హూడ్ ప్రమోషన్‌లో భాగంగా నితిన్ ఈ చిత్ర ట్రైలర్ సమయం అండ్ సినిమా తేదీని ప్రకటించారు.
రాబిన్‌హుడ్ ట్రైలర్ మార్చి 21న సాయంత్రం 4.05 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. అలాగే మార్చి 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుందని తెలిపారు. ఈ వార్త విన్న నెటిజన్లు ఎగిరిగంతులేస్తున్నారు.
Read More..
ప్రముఖ రచయిత కన్నుమూత.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎమోషనల్ పోస్ట్..?