- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రోల్ అవుతున్న 'భీమ్లా నాయక్' బ్యూటీ.. ఆ మాటలే కారణం
దిశ, వెబ్‌డెస్క్: 'భీమ్లా నాయక్' తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమా. ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కొన్ని రోజుల క్రితం మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ తన స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో మాట్లాడి కుర్రకారు మనసుల్ని కాజేసింది. అయితే ఇప్పుడు మాత్రం నెటిజన్స్ అమ్మడి ఓ ఆట ఆడుకుంటున్నారు. నెట్టింట అమ్మడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. అందుకు ఈవెంట్‌లో ముద్దుగుమ్మ మాట్లాడిన మాటలే కారణం. సంయుక్త తన స్పీచ్‌ని ఇంగ్లీషులో రాసుకొని గూగుల్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకుందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అందుకు అమ్మడు వాడిన 'ఆంధ్ర, తెలంగాణ మాతృభూమికి వందనం' వంటి వాక్యాలే కారణంగా మారాయి. వాటితో పాటుగా పొలిటికల్ ఈవెంట్స్‌లో పవన్ వాడే 'ఇల్లేమో దూరం' అన్న కావ్యాన్ని అమ్మడు తన స్పీచ్‌లో వాడేసింది. దీంతో నెటిజన్స్ సంయుక్తపై ట్రోల్స్ కురిపిస్తున్నారు. 'అంత చేసిందానివి.. త్రివిక్రమ్ చేత స్పీచ్ రాయించుకొని ఉండాల్సింది' అంటూ ట్రోల్ చేస్తున్నారు. వీరితో పాటు మీమర్స్ కూడా నెట్టింట తెగ హల్‌చల్ చేసేస్తున్నారు. మరి దీనిపై అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి.