Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఒక్క ట్వీట్‌తో షాకిచ్చిన చిత్రబృందం

by Hamsa |
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఒక్క ట్వీట్‌తో షాకిచ్చిన చిత్రబృందం
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

జనవరి 6వ తేదీన 9 గంటలకు 6 నిమిషాలకు ‘ మాట వినాలి’ అనే పాట రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. దీంతో అది చూసిన అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘హరి హర వీరమల్లు’ మూవీ మేకర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ తెలిపారు. ‘‘హరిహర వీరమల్లు’ నుండి మా మొదటి సింగిల్ “మాట వినాలి” ప్రకటన పట్ల మీరు చూపిన అపురూపమైన స్పందన, ప్రేమను చూసి మేము చాలా సంతోషిస్తున్నాం.

కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల మేము ఈ పాటను విడుదల చేయడానికి కొంచెం అదనపు సమయాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని మేము హామీ ఇస్తున్నాము. మీ నిరీక్షణ విలువైనది.. వేచి ఉండండి. సంగీత తుఫాను త్వరలో మీ ప్లే లిస్ట్‌లోకి రాబోతుంది’’ అని X ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన అభిమానులు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు నిరాశ చెందుతున్నారు.

Advertisement

Next Story