Ghaati : విశ్వరూపం చూపిస్తున్న అనుష్క శెట్టి.. ఆ గ్లింప్స్ చూస్తే అదుర్స్..!

by sudharani |   ( Updated:2024-11-07 13:05:24.0  )
Ghaati : విశ్వరూపం చూపిస్తున్న అనుష్క శెట్టి..  ఆ గ్లింప్స్ చూస్తే అదుర్స్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌‌గా దూసుకుపోయిన అనుష్క శెట్టి (Anushka Shetty).. ‘బాహుబలి’ (Bahubali) తర్వాత సినిమాలకు దూరం అయింది. ఇక గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్వీటీ.. ప్రజెంట్ ‘ఘాటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. క్రిష్ జాగర్లమూడి (Directed Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీతో తెరకెక్కుతోన్న ‘ఘాటీ’ (Ghaati)మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

ఇక ఆప్పటికే ఈ మూవీ అనౌన్స్‌మెంట్స్ కంటెంట్‌తో హైప్ పెంచేసిన చిత్ర బృందం.. తాజాగా అనుష్క శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నెట్టింట విశేషంగా వైరల్‌గా కావడంతో.. ఇప్పుడు ఇదే జోష్‌లో ‘ఘాటీ’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో.. అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్టు దారుణంగా చూపించారు. అనుష్కను మాస్ ఎలివేషన్‌తో చూపిండంతో.. అసలు ‘ఘాటీ’ కథేంటి అందులో అనుష్క పాత్రేంటి అనేది క్యూరియాసిటీగా మారింది.

Advertisement

Next Story