Chiranjeevi: మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాలో మరో క్రేజీ హీరో.. ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన ట్వీట్

by Hamsa |
Chiranjeevi: మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాలో మరో క్రేజీ హీరో.. ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన ట్వీట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘విశ్వంభర’(Vishvambhara). ఈ మూవీలో త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సోషియోఫాంటసీ తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘విశ్వంభర’ మే 9న విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ తప్ప ఎలాంటి అప్డేట్స్ రిలీజ్ కాలేదు. ఇక భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా అభిమానులు ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ షూటింగ్ పూర్తి చేసుకోకపోవడం వల్ల మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్స్‌ను విడుదల చేయడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కామియో రోల్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ రోజు నుంచి షూటింగ్ కూడా జాయిన్ అయినట్లు నెట్టింట ఓ పోస్ట్ చక్కర్లు కొడుతూ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఈ సారి థియేటర్స్ దద్దరిల్లుతాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ ‘విశ్వంభర’ సినిమాపై హైప్ పెంచుతోంది.

Next Story

Most Viewed