Toxic: ఆ క్షణం ఎంతగానో గుర్తుండిపోయింది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ‘టాక్సిక్’ నటుడు

by sudharani |
Toxic: ఆ క్షణం ఎంతగానో గుర్తుండిపోయింది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ‘టాక్సిక్’ నటుడు
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ య‌ష్ (Yash) నటిస్తున్న లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ (Toxic: A Fairytale for Grownups). క‌న్నడ‌ (Kannada), ఇంగ్లీష్‌(English)లో రూపొందిస్తోన్న తొలి భారీ చిత్రంగా టాక్సిక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌న భార‌తీయ క‌థ‌నానికి, అంత‌ర్జాతీయ ప్రేక్షకుల మ‌ధ్య వార‌ధిగా ఈ చిత్రం నిలుస్తుంది. గొప్ప సంస్కృతి క‌లిగిన క‌న్నడ చిత్రసీమ‌ను మ‌న ఇండియ‌న్ సినీ ప్రేక్షకుల‌కు ఓ స‌రికొత్త ప్రామాణిక‌త‌ను నిర్దారిస్తూ ముందుకు తీసుకెళ్లటానికి ఈ చిత్రం కేంద్రబిందువుగా మారుతుంది. కె.వి.ఎన్‌.ప్రొడ‌క్షన్స్‌, మాన్‌స్టర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ, మ‌లయాళ భాష‌లు స‌హా ప‌లు భార‌తీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో అమెరికన్ నటుడు కైల్ పాల్ (Kyle Paul) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమాపై స్పందిస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘నేను ఇప్పటి వ‌ర‌కు చేసిన సినిమాల్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో నాకు క‌లిగిన ఎక్స్‌పీరియెన్స్ బెస్ట్ అని చెబుతాను. తెలియ‌ని భాష‌లో భావోద్వేగ స‌న్నివేశాల్లో న‌టించ‌టం అనేది ఎంతో స‌వాలుతో కూడుకున్నది. కానీ ఆ వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌(Working Experience)ను మ‌ర‌చిపోలేను. నేను ఇండియాలో టాక్సిక్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ గొప్ప అనుభ‌వాన్ని పొందాను. ఆరోజు ఉద‌యం మూడు గంట‌ల‌కు షూటింగ్ (Shooting) చేస్తున్నాం. అదొక భావోద్వేగ స‌న్నివేశం. అలాంటి సన్నివేశంలో నేను క‌న్నడ‌లో మాట్లాడాలి. ఆ ప‌దాల‌ను లాజికల్‌గా ఆలోచిస్తూ ఎమోషనల్‌గా ఉండాలి. కానీ నేను లాజికల్‌గా ఆలోచించ‌లేక‌పోయాను. దీంతో ఎమోషనల్‌(Emotional)ను తీసుకురాలేకపోయాను. న‌టుడిగా ఆ క్షణం ఎంతగానో గుర్తుండిపోయింది. అప్పుడు నేను సన్నివేశాన్ని పూర్తి చేయటానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ డైరెక్టర్ గీతూ మోహ‌న్ దాస్ ఎంతో స‌హ‌కారాన్ని అందించింది. మీరు ఈ స‌న్నివేశంలో బాగా న‌టించ‌గ‌ల‌రు. ప్రయ‌త్నించండి.. కావాలంటే ఇంకా స‌మ‌యం తీసుకోండి అని న‌న్నెంత‌గానో ఉత్సాహ‌ప‌రిచారు. ఇది న‌టుడిగా నేను ఎదుర్కొన్న గొప్ప అనుభ‌వం. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని తెలిపారు.

Next Story