Amaran OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. ఎన్నీ భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

by sudharani |
Amaran OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. ఎన్నీ భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్’ (Amaran). ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ (Major Mukund Varadarajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి (Raj Kumar Periasamy) దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 150 కోట్లు భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచి.. కాసుల వర్షాన్ని కురిపించింది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిస్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది. ‘మేజర్ ముకుంద్- ఇంధు మీ ముందుకు వస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ అండ్ హిందీలో చూడండి!’ అంటూ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంటే.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Next Story