హీరోలకు లక్కీ గర్ల్‌గా మారిన అల్లు అర్జున్ బ్యూటీ.. ఆ విషయంలో స్టార్స్‌కు కూడా మించిపోతుందిగా

by Kavitha |
హీరోలకు లక్కీ గర్ల్‌గా మారిన అల్లు అర్జున్ బ్యూటీ.. ఆ విషయంలో స్టార్స్‌కు కూడా మించిపోతుందిగా
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది.

అలా ప్రపంచ వ్యాప్తంగా రూ.1899 కోట్లు రాబట్టి ఎన్నో రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend), ‘థామా’(Thama), ‘కుబేర’(Kubera) వంటి సినిమాలతో బిజీగా ఉన్నా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రష్మిక మందన్నఇప్పుడు కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్ హీరోలకు లక్కీ గర్ల్‌గా మారిపోయింది. అలా ‘యానిమల్’(Animal) సినిమాతో లవర్ బాయ్ రణబీర్(Ranbeer) కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రూ.900 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమాలో గీతాంజలి(Geethanjali) పాత్రలో నటించి మెప్పించింది.

అంతేకాకుండా రీసెంట్‌గా విక్కీ కౌశల్(Vicky Kaushal) హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ‘ఛావా’(Chhaava) మూవీతో కూడా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో రష్మిక అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ హీరోలకు లక్కీ చార్మ్‌గా మారిపోయిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ అమ్మడు గ్రాఫ్ కూడా ఒక్కసారికే పెరిగిపోయి నెంబర్ వన్ ప్లేస్‌లోకి కూడా రావడం ఖాయమని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story

Most Viewed