Allari Naresh: ‘బచ్చల మల్లి’ థర్డ్ సింగిల్ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్

by Hamsa |
Allari Naresh: ‘బచ్చల మల్లి’ థర్డ్ సింగిల్ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’(Bachchalamalli). ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దీనికి సుబ్బు మంగాదేవి(Subbu Mangadevi) దర్శకత్వం వహిస్తుండగా.. హాస్యా మూవీస్(Hasya movies) బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బచ్చల మల్లి’ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ‘బచ్చల మల్లి’ సినిమా అప్డేట్‌ ఇచ్చారు. డిసెంబర్ 9వ తేదీన మూడో పాట రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దీని కోసం క్రీడా వికాస కేంద్రం (రాజా గ్రౌండ్) తుని, బచ్చల మల్లి టీం మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో విన్ అయిన టీమ్ మెంబర్స్ ‘బచ్చలమల్లి’ థర్డ్ సింగిల్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో అల్లరి నరేష్ బీడీ తాగుతూ మాస్ లుక్‌(Mass look)లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

Advertisement

Next Story

Most Viewed