Ananya Nagalla :నటి అనన్య నాగళ్ళకు ఉచిత సలహా చిక్కులు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-13 09:07:33.0  )
Ananya Nagalla :నటి అనన్య నాగళ్ళకు ఉచిత సలహా చిక్కులు
X

దిశ, వెబ్ డెస్క్ : అవకాశం ఉంది కదా అని ఊరికే ఉచిత సలహాలు ఇస్తే అవి ఒక్కోసారి లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. అలాంటి అనుభవమే హీరోయిన్ అనన్య నాదేళ్ళకు ఎదురైంది. నటి అనన్య నాగళ్ళ ఇటీవల ప్లాస్టిక్ ఉపయోగించవద్దని, స్టీల్ స్ట్రా తమతో పాటు క్యారీ చేయమని ఉచిత సలహాతో వీడియో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఉల్టా ఆమెకే సలహాలిచ్చారు. తన వీడియోపై వరుస ట్రోల్స్ పై స్పందించిన అనన్య ట్రోలర్స్ పై అసహనం వ్యక్తం చేసింది. మరో వీడియోతో ట్రోలర్స్‌కి ఆమె కౌంటరిచ్చింది.

‘‘ప్లాస్టిక్ యూస్ చేయడం తగ్గించమని చెప్పానని.. ఇందులో తప్పేమైనా ఉందా అని ప్రశ్నించింది. నచ్చితే సలహాను పాటించండి లేకపోతే లేదని.. ఇంతలా ట్రోల్ చేయడం కరెక్ట్‌గా లేదని వీడియోలో పేర్కొంది. పర్యావరణ హితం..అరోగ్య పరిరక్షణ నేపథ్యంలో తాను సదుద్ధేశంతో వీడియో చేస్తే దానిపై అనవసర కామెంట్లతో ట్రోలింగ్ చేయడం ఎందుకని..ఇంత నెగటివిటీ అవసరమా అని ప్రశ్నించింది.

Advertisement

Next Story