నటుడికి ఘోర రోడ్డు ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు.. ఒక్క పోస్ట్‌తో ట్విస్ట్ ఇచ్చాడుగా!

by Hamsa |
నటుడికి ఘోర రోడ్డు ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు.. ఒక్క పోస్ట్‌తో ట్విస్ట్ ఇచ్చాడుగా!
X

దిశ, సినిమా: స్టార్ నటుడు, కమెడియన్ యోగిబాబు(Yogi Babu)కు రోడ్డు ప్రమాదం జరగినట్లు సమాచారం. గత కొన్ని గంటల నుంచి పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటలకు యోగిబాబుకు ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడిక్కడే మరణించారని కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో కొన్ని క్షణాల్లోనే ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఆందోళన చెందుతూ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు పలు పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, యోగిబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే రోడ్డు ప్రమాదం జరిగి నేను చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరం. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది కానీ ఆ కారులో మాత్రం నేను లేను. కనీసం నా సహాయకుడు కూడా ప్రమాదం జరిగిన కారులో ప్రయాణించలేదు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారంతా క్షేమంగానే ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధాలు. తప్పుడు వార్తల వల్ల నా స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు, పత్రికాధిపతుల వంటి అనేకమంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు.

అయితే నా క్షేమం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. నా పట్ల వారు చూపిన ప్రేమకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు. అలాగే ఫొటోలను కూడా షేర్ చేశాడు. కాగా, యోగిబాబు ఎన్నో తమిళ చిత్రాల్లో కమెడియన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. హీరోగానూ కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక గత ఏడాది వచ్చిన ‘కంగువ’(Kanguwa) చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ‘రాజాసాబ్’(Rajasab) మూవీలో కూడా యోగిబాబు నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10 థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీనిని మారుతి తెరకెక్కిస్తుండగా.. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Next Story

Most Viewed