Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకులు నిజమేనా? కన్ఫ్యూజ్ చేస్తున్న అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలు

by Rani Yarlagadda |
Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకులు నిజమేనా? కన్ఫ్యూజ్ చేస్తున్న అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఐశ్వర్య (Abhishek - Aishwarya Divorce)తో విడాకులపై మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. పెళ్లయ్యాక ప్రతి భర్త తన భార్య మాట వింటే.. కాపురం చాలా బాగుంటుందని అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న అభిషేక్.. హోస్ట్ అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. సినిమాలపై విమర్శలు వచ్చినా.. వాటిని ఎలా ఎదుర్కొంటున్నారని ప్రశ్నించగా.. వాటిని పెద్దగా పట్టించుకోనన్నారు అభిషేక్. డైరెక్టర్ చెప్పినట్లుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తాను అనగానే.. నిజమే నేను కూడా ఇంట్లో నా భార్య ఏం చెప్పినా వింటానన్నాడు హోస్ట్. అందుకు అభిషేక్ కూడా అదే నిజం అన్నారు. పెళ్లైన మగవాళ్లు భార్యల మాట వింటే బాగుపడతారన్నారు. అంటే అభిషేక్ భార్య మాట వింటున్నట్టా ? విననట్టా? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు.

అంతేకాదు.. ఆరాధ్య బాగోగులన్నీ ఐశ్వర్య ఇంట్లోనే ఉండి చూసుకుంటుండటంతోనే.. తాను బయటికి వచ్చి షూటింగ్స్ లో పాల్గొనగలుగుతున్నానని, ఇది నిజంగానే తన అదృష్టమన్నారు అభిషేక్. ఈ మాటలు విన్న నెటిజన్లకు మతిపోయినంత పనైంది. మొన్నటి వరకూ వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారని, అఫీషియల్ గా ప్రకటించడమే ఆలస్యమన్నారు సన్నిహితులు. ఇప్పుడు అభిషేక్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. వారిద్దరూ కలిసే ఉన్నారా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా ఈ జంట విడాకులు తీసుకుందన్న వార్తలు నిజం కాకపోతే బాగుండని దేవుడిని కోరుకుంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed