- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై బయోపిక్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన యంగ్ బ్యూటీ

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరిని.. ‘ఒకవేళ మీరు గనుక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బయోపిక్‌ని రాస్తే టైటిల్ ఏమని పెడతారు’ అని అడుగగా.. దానికి ఈ అమ్మడు స్పందిస్తూ.. "‘ద గ్లాస్ ఈజ్ ఆల్వేస్ హాఫ్ ఫుల్‘ అని పెడతాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లోగో గ్లాస్ కదా.. కాబట్టి నేను గ్లాస్ పెడతాను. ఆయనకు పాజిటివ్ యాడిట్యూడ్ ఉంటుంది. ఆయన పొలిటికల్ జర్నీ ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. 2 టర్మ్స్ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు, అయినా ఎప్పుడూ నిరాశ చెందలేదు. కాబట్టి నెవెర్ గివ్ అప్ అనేదానికి ఆయన ఇన్స్పిరేషన్. మీరు నమ్మే దాన్ని ఫాలో అవ్వాలి అనడానికి ఆయనే నిదర్శనం" అంటూ పవర్ స్టార్ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.