- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tollywood Star Hero: 1 కాదు 2 కాదు.. ఏకంగా 10 బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్న స్టార్ హీరో.. ?

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా సినిమాల్లోకి అడుగు పెట్టాలంటే ఎవరో ఒకరు తెలిసి ఉండాలని కొందరు అంటుంటారు. మరి కొందరు ఎవరి సపోర్ట్ లేకుండా తమ ట్యాలెంట్ నే నమ్ముకుని కష్టపడి సినిమాలు చేస్తుంటారు. టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది నేచురల్ స్టార్ నాని ( Naturalstar Nani ) నే. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి .. ఎవరో ఎందుకు నేను కూడా చేయగలనంటూ హీరోగా ట్రై చేసి తక్కువ సమయంలో స్టార్ గా గుర్తింపును పొందాడు.
" అష్టా చమ్మా " ( Ashta Chamma ) మూవీ ద్వారా ఆడియెన్స్ కు పరిచయమైన హీరో నేచురల్ స్టార్ నాని. ఆయన మూవీ వస్తుందంటే పెద్దగా హడావుడి లేకుండా ప్రతి ఒక్క అభిమానిని ఆకర్షించే విధంగా ఉండాలని అనుకుంటాడు. ఆయన ఉండటమే నేచురల్ గా ఉండటమే కాకుండా నాని మూవీస్ కూడా అలాగే ఉంటాయి. అయితే, అష్టాచమ్మా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నాని ఈ చిత్రంలో హీరోగా కాదట. వాస్తవానికి ఈ మూవీని ఒక పెద్ద ఫ్యామిలీ కి చెందిన స్టార్ హీరోతో చేయాలనుకున్నారట. కానీ, చివరి నిమిషంలో అతను నో చెప్పడంతో ఎవ్వరూ ఊహించలేని విధంగా " నాని " ని ఫైనల్ చేశారని తెలిసిన సమాచారం.
ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా చేసిన నానికి ఎలాంటి పారితోషికం ఇవ్వలేదట. ఏమి ఆశించకుండా హీరోగా అవకాశం రావడమే గొప్ప అనుకుని ఈ చిత్రాన్ని చేసినట్టు తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి నాని వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. భీమిలి కబడ్డీ జట్టు, రైడ్, అలా మొదలైంది వంటి మూవీస్ తో అలరించిన ఈ కుర్రాడు రాజమౌళి కంట్లో పడ్డారు. దీంతో " ఈగ " ( Eega ) అనే సరి కొత్త కథతో పరిచయం చేశారు జక్కన్న. అయితే, ఈ మూవీ తర్వాత వరుస ఫ్లాపులవ్వడంతో ఇక నాని కెరియర్ ముగిసిందనుకున్న సమయంలో మారుతి డైరెక్షన్లో వచ్చిన " భలే భలే మగాడివోయ్ " ( Bhale Bhale Magadivoy ) మూవీతో పెద్ద హిట్ అందుకున్నాడు.
ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతో నాచురల్ స్టార్ హిట్లు, ఫ్లాపులను అని లెక్కచేయకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే " సరిపోదా శనివారం " మూవీతో సరికొత్త లుక్ లో మన ముందుకొచ్చాడు. అయితే, నాని కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలకు నో చెప్పి తర్వాత బాధ పడ్డారట. ఆయన రిజెక్టు చేసిన మూవీస్ అన్ని బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. ఆ సినిమాలు ఏంటంటే.. ఉయ్యాల జంపాల, సుప్రీమ్, ఊపిరి, మహానటి ( ఏ ఎన్ ఆర్ పాత్ర ), సుకుమారుడు, తడాకా, గుండెజారి గల్లంతయ్యిందే, జాను, శ్రీకారం.. లాంటి చిత్రాలు నాని వదులుకోగా.. వీటిలో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచి మంచి వసూళ్ళను సాధించాయి.