మూడు రోజుల పసికందును కాపాడిన సీఐ

by srinivas |
మూడు రోజుల పసికందును కాపాడిన సీఐ
X

మూడు రోజుల పసికందును సీఐ కాపాడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోని పొదల్లో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. కరోనా లాక్‌డౌన్ విధుల నిమిత్తం గ్రామంలోకి వెళ్తున్న బొబ్బిలి సీఐ కేశవరావు చెవిన పడింది. దీంతో ఆయన వెళ్లి చూడగా, పొదల్లో మూడు రోజుల పసికందు గుక్కపట్టి ఏడుస్తూ కంటబడింది. దీంతో బిడ్డను బొబ్బిలిలోని గోషా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. అయితే బిడ్డ అదే గ్రామానికి చెందిన మహిళ విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లో జన్మనిచ్చిందని తేలింది. అండర్ వెయిట్ బేబీ కావడంతో వదిలించుకునే ఉద్దేశ్యంతో అలా వదిలేసినట్టు, పోలీసుల కంటబడడంతో ప్రస్తుతం కావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.

Tags: baby, baby in bushes, vizianagaram district, alajangi

Advertisement

Next Story

Most Viewed