రికార్డు సృష్టించిన చిత్తరంజన్ లోకోమోటివ్స్

by Shamantha N |
రికార్డు సృష్టించిన చిత్తరంజన్ లోకోమోటివ్స్
X

దిశ, వెబ్‌డెస్క్:
భారతీయ రైల్వే వారి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డబ్ల్యూ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక సంవత్సర కాలంలో అతి ఎక్కువ లోకోమోటివ్స్ తయారుచేసిన సంస్థగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ వారు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 402 లోకోమోటివ్‌లు తయారు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 350 లోకోమోటివ్‌లు తయారుచేసిన రికార్డును ఈ ఏడాది బ్రేక్ చేసింది.

ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మిశ్రా ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది కూడా చిత్తరంజన్ లోకోమోటివ్ వారు తమ ఉత్పత్తిని బాగా వృద్ధి చేశారు. ఇప్పటికే 350కి పైగా లోకోమోటివ్‌లు తయారు చేసినట్లు తెలుస్తోంది. 350 తయారుచేయడానికి గతంలో 299 పని దినాలు అవసరమయ్యేవి కానీ ఇప్పుడు వాటిని 250కి తగ్గించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఈ ఉత్సాహంతోనే పనిచేసి 2019-20లో కూడా రికార్డు సృష్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Tags – Chittaranjan Locomotives, Indian Railway, Limca book of Records, Praveen

Advertisement

Next Story

Most Viewed