చైత్రరెడ్డి, రాకేష్ సీక్రెట్ లవ్‌కు ఎండ్ కార్డ్!

by Shyam |   ( Updated:2020-10-24 07:06:10.0  )
చైత్రరెడ్డి, రాకేష్ సీక్రెట్ లవ్‌కు ఎండ్ కార్డ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమా రంగంలో నటీనటులు కాస్త క్లోజ్‌గా ఉన్నా వారిపై పుకార్లు రావడం సహజం. అందులో వాస్తవం లేదనుకోవడం కూడా సరికాదు. చాలా మంది రిలేషన్స్ గాసిప్స్ వల్లే వెలుగులోకి వస్తాయి. కొందరు వాటిని ఖండిస్తే.. మరికొందరు మౌనం పాటిస్తూ తమ రిలేషన్‌ను కొనసాగిస్తారు. కొందరు మాత్రం డేర్ స్టెప్ వేసి అవును మేం రిలేషన్‌లో ఉన్నామని కుండబద్దలు కొడ్తారు. ఇలాంటి ఘటనే తమిళ ఇండ్రస్టీలో వెలుగులోకి వచ్చింది.

సినీతార, టెలివిజన్ నటి చైత్ర రెడ్డి.. యువ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాకేష్ ప్రేమవ్యవహారం గత కొద్దిరోజులుగా మీడియాలో చక్కర్లు కోడుతోంది. అందుకు సంబంధించిన ఊహగానాలకు తాజాగా చైత్ర, రాకేష్ బ్రేక్ వేశారు. అత్యంత నిరాడంబరంగా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. చేతికి ఉంగరాన్ని తొడిగి చైత్రరెడ్డితో జీవితాన్ని ఆరంభించడానికి రాకేష్ తొలి అడుగు వేశాడు. దీనికి చైత్రరెడ్డి స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు.

రాకేష్ సామల అనగనగా ఒక నాన్న లాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. చైత్రరెడ్డి కెరీర్ విషయానికి వస్తే.. కన్నడలో అవును మాతే శ్రావణి షోతో నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రగ్గడ్ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్ర రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లితో మరో కొత్త జీవితానికి తెరలేపారు.

కల్యాణ ముదల్ కాద్ వారై అనే సీరియల్‌తో ‘చైత్రరెడ్డి’ తమిళ టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు. యారాడి నీ మోహిని సీరియల్‌తో ఆమె మంచి గుర్తింపు పొందారు. తన నటనతో అత్యధికంగా మహిళా అభిమానులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. గత మార్చిలో రాకేష్ సామలతో ప్రేమలో ఉన్నట్లు ఆమె ఇన్‌స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు.

Advertisement

Next Story