లొకేషన్స్ వేటలో చిరు ‘వేదాళం’ రీమేక్

by Jakkula Samataha |
లొకేషన్స్ వేటలో చిరు ‘వేదాళం’ రీమేక్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ తర్వాత వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ఇందులో అజిత్ నటించిన తమిళ్ చిత్రం ‘వేదాళం’ ఒకటి కాగా, దీనిని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను డిజైన్ చేశారని సమాచారం. ప్రస్తుతం మెహర్ రమేష్ లోకేషన్స్ వేటలో ఉండగా కీలక సన్నివేశాలు మాత్రం ఒరిజినల్ వెర్షన్‌ను ఫాలో అవుతారని తెలుస్తోంది. సేమ్ లొకేషన్స్ యూజ్ చేయనుండగా..సాయి పల్లవి చిరుకు చెల్లిగా కీ రోల్ ప్లే చేయనుందట. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ సినిమాను నిర్మించనుందని టాక్. మరి చరణ్ ఎప్పటిలాగే తండ్రి సినిమాకు నిర్మాతగా ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది

మరో వైపు ‘లూసిఫర్’ రీమేక్‌ను అఫిషియల్‌గా ప్రకటించిన చిరు..మోహన్‌రాజా డైరెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న లాంచ్ కానున్న మూవీలో ఇప్పటికే సత్య‌దేవ్ నటిస్తున్నాడని కన్‌ఫర్మ్ కాగా, నయనతార ప్రధాన పాత్రలో కనిపించబోతుందని టాక్. ఇక మలయాళంలో టోవినో థామస్ నటించిన పాత్రలో రానా, విజయ్ దేవరకొండ లేక రామ్ చరణ్ నటిస్తారని వార్తలు రాగా, అసలు ఆ క్యారెక్టర్ లేకుండానే సినిమా స్క్రిప్ట్ సిద్ధం అయిందని లేటెస్ట్ అప్‌డేట్.

Advertisement

Next Story