డ్యాన్స్ చేస్తే నో స్ట్రెస్ : చిరు

by Shyam |   ( Updated:2020-04-29 03:43:53.0  )
డ్యాన్స్ చేస్తే నో స్ట్రెస్ : చిరు
X

‌మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ను ఎలా వాడాలో అలాగే వాడుతున్నారు. సోషల్ మీడియా ఎంత చక్కగా వినియోగించుకోవచ్చో చూపిస్తున్నాడు. అభిమానులతో నేరుగా టచ్ లో ఉండేందుకు సామాజిక మాధ్యమంలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు… చెప్పినట్లుగానే అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఏదీ ఎలా చేయాలో చెప్తూనే… ఎంటర్టైన్మెంట్ కు ఎక్కడా కొదవ రాకుండా లేకుండా చూసుకుంటున్నాడు. నిన్న మనవరాలితో చేసిన అల్లరి షేర్ చేసిన చిరు… ఏప్రిల్ 29 ఇంటర్నేషనల్ డాన్స్ డే పురస్కరించుకుని మరో వీడియో తో ముందుకు వచ్చారు. డ్యాన్స్ కు తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూనే… డ్యాన్స్ వల్ల కలిగే లాభాల గురించి తెలిపారు.

డ్యాన్స్ నా సినీ జీవితంలో అంతర్భాగం అయిపోయిందని తెలిపిన చిరు… ఈ డ్యాన్స్ వల్లే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నట్లు చెప్పాడు. అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం పొందాను అని చెప్పాడు. అంతే కాదు డ్యాన్స్ ఒక స్ట్రెస్ బస్టర్ లా పని చేస్తుంది అంటున్నారు చిరు. మూడ్ బాగా లేనప్పుడు మ్యూజిక్ ఆన్ చేసి స్టెప్స్ వేస్తే చాలా రిలీఫ్ కలుగుతుందని తెలిపాడు. లాక్ డౌన్ పీరియడ్ లో చాలా మంది ఒత్తిడికి లోనై ఉంటారని… అలాంటప్పుడు ఒక్కసారి డ్యాన్స్ ట్రై చేయమని కోరాడు. ఎంత ఉల్లాసంగా ఉంటుందో గమనించాలని కోరారు. అలాగే మీ ఫ్రెండ్స్ ను కూడా నామినేట్ చేయాలని… అలా అందరూ హ్యాపీగా, ఒత్తిడి లేకుండా ఉండాలని సూచించాడు. అలా చేసిన డ్యాన్స్ వీడియోలను షేర్ చేయాలన్న చిరు… తను కూడా డ్యాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తానని తెలిపాడు.


Tags: Chiranjeevi, International Dance Day, Social Media, Fans, Tollywood

Advertisement

Next Story

Most Viewed