- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జనసైనికుల ఆశలపై నీళ్లు చల్లుతున్న మెగాస్టార్!
దిశ, ఏపీ బ్యూరో: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తమ్ముడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. నిత్యం జగన్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ పార్టీ నేతలు సైతం సోషల్ మీడియాలో అధికార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్కస్థానానికే పరిమితమవ్వడంతో రాబోయే ఎన్నికల్లో అన్నయ్య సహకారంతో గట్టెక్కొచ్చని తమ్ముడు, ఆయన పార్టీ నేతలు భావిస్తున్నారు. అన్నయ్యకు ఓవైపు రాజకీయ అనుభవం.. మరోవైపు సినీగ్లామర్ ఉండటంతో తమకు కలిసొస్తుందని తమ్ముడు.. ఆ పార్టీ నేతలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ సమయం దొరికినప్పుడల్లా వారి ఆశలపై అన్నయ్య నీళ్లు చల్లుతున్నారు. తరచూ జగన్ సర్కార్‌ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అన్నయ్య చేస్తున్న పనులతో తమ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తమ్ముడు పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ అన్నయ్య ఎవరు.. తమ్ముడు ఎవరో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఇంకెవరూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్నదమ్ముల మధ్య ట్వీట్ పెట్టిన పొలిటికల్ హీట్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి గుర్తించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో మకుటంలేని మహారాజు. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. మెగాస్టార్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆశేశ అభిమానులు కలిగి ఉన్న పవన్‌ను ఓ దేవుడిలా కొలుస్తారు అభిమానులు. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 18 స్థానాలకే పరిమితమయ్యారు. అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్రమంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి దాదాపు రాజకీయాలకు దూరమై వెండితెరకు దగ్గరయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఆ తర్వాత చిరంజీవి అవుతారని ఆయన అభిమానులు భావించారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. ఇంతలో 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. కానీ టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికి, గెలుపులో కీలక పాత్ర పోషించారు. పవన్ పిలుపుతో అటు మెగా అభిమానులతోపాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించడంలో కీలకంగా మారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగాపోటీ చేసి ఒక్క సీటుకే పరిమితమైంది. చివరకు గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరమై.. అధికార పార్టీ వైసీపీకి దగ్గరయ్యారు.
ఈ రాజకీయ పరిణామాలతో జనసేన పార్టీ అధికారపార్టీని ఎప్పుడు అవకాశం దొరికినా ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. పవన్‌తో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు సైతం ప్రత్యర్థులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని భావించింది. కానీ బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో జనసైనికులు బీజేపీపై ఆగ్రహంతో రగిలిపోయారు. తమ సత్తా ఏంటో పోలింగ్‌రోజు చూపించారు. మిత్రులెవరైనా తమ రాజకీయ ప్రత్యర్ధి మాత్రం వైసీపీయేనని జనసేన పార్టీ ఫిక్స్ అయ్యింది.
ఇలాంటి తరుణంలో చిరంజీవి మంచితనం తమను ముంచుతుందేమోనన్న చర్చ జనసేనలో మొదలైనట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ జనసేన విమర్శిస్తుంటే చిరంజీవి మాత్రం ప్రభుత్వంపై ట్వీట్లతో ప్రశంసలు కురిపిస్తున్నాడు. ట్వీట్ల వ్యవహారం జనసేన క్యాడర్‌లో హీట్ రేపుతోందట. అందుకు ప్రతిగా సీఎం జగన్ సైతం చిరంజీవికి రీట్వీట్ చేయడం పార్టీలో పెద్ద చర్చకు దారితీస్తోందట. చిరంజీవి చేసే కామెంట్లూ, ట్వీట్లూ తమను రాజకీయంగా దెబ్బతీస్తున్నాయని జనసేన క్యాడర్ భావిస్తోందట. గతంలో వైసీపీపై పోరాటం చేస్తున్న తరుణంలో చిరంజీవి దంపతులు సీఎం జగన్ ఇంటికి వెళ్లడం, విందు భేటీ జరపడంపై జనసేన క్యాడర్ తలపట్టుకుందట. ఆ తర్వాత షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని.. ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించాలంటూ పలువురు సినీ పెద్దలతో చిరంజీవి సీఎం జగన్‌ను కలిశారు. ఈ పరిణామాలతో చిరంజీవికి రాజ్యసభ సీటును వైసీపీ ఆఫర్ చేస్తోందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి.
మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా జనసైనికులు గానీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆక్సిజన్ బ్యాంకుల విషయంలో ఇతర విషయాల్లో చిరంజీవికి బాసటగా నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో చిరంజీవి చేసే పనులు పార్టీ క్యాడర్‌ను అయోమయంలోకి నెట్టేసేలా ఉన్నాయని జనసేన పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి ఇప్పటికైనా జనసేనను చిక్కుల్లోకి పెట్టకుండా ఇలాంటి కార్యక్రమాలకు అన్నయ్య చెక్‌పెడతారా లేక తమ్ముడు తమ్ముడే.. రిలేషన్స్ రిలేషన్సేనని తనదైన ధోరణిలో ముందుకు పోతారా అన్నది వేచిచూడాలి.