ఎన్టీఆర్‌కు కరోనా.. హెల్త్‌ అప్‌డేట్స్‌ ఇచ్చిన చిరంజీవి

by Shyam |   ( Updated:2021-05-12 04:02:55.0  )
ఎన్టీఆర్‌కు కరోనా.. హెల్త్‌ అప్‌డేట్స్‌ ఇచ్చిన చిరంజీవి
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు మంగళవారం స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొవిడ్-19 ప్రొటోకాల్స్ పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు తారక్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్టు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. కాగా ఎన్టీఆర్‌తో పాటు తన కుటుంబ సభ్యులందరూ బాగానే ఉన్నారని తెలిపిన చిరు.. జూనియర్ ఎనర్జీని చూసి హ్యాపీగా ఫీలయ్యానని, వారంతా త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed