కరోనాను పారదోలెందుకు వెలుగులు నింపాలి

by Shyam |   ( Updated:2020-04-04 08:24:35.0  )
కరోనాను పారదోలెందుకు వెలుగులు నింపాలి
X

దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. డాక్టర్లు, పోలీసులు శక్తిని మించి పని చేస్తూ… కరోనా వ్యాధిగ్రస్తులను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారు. వారి కృషిని అభినందిస్తూ మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ రోజున దేశం మొత్తం చప్పట్లు కొట్టి అభినందించింది. అదే స్ఫూర్తితో దేశం నుంచి కరోనా చీకట్లను పారదోలేందుకు ఏప్రిల్ 5 రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు ఆర్పేసి… దీపాలు వెలిగించాలని మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మోడీ. ప్రధాని సూచనకు దేశం మొత్తం సంఘీభావం తెలపాలని కోరుతున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. తద్వారా దేశమంతా ఒకటేనని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. తొమ్మిది నిమిషాల పాటు లైట్స్ ఆర్పేసి… దీపాలు, టార్చ్ లైట్ లేదా మొబైల్ లైట్ వెలిగించి మన పోరాట స్ఫూర్తిని మరొక్క సారి చాటి చెప్పాలని కోరారు నాగ్.

భారత ప్రధాని పిలుపుకు స్పందించాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు కుటుంబంతో కలిసి ఆరుబయట గుమ్మంలో దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్ లేదా మొబైల్ ఫ్లాష్ లు వెలిగించి సంఘీభావం తెలపాలన్నారు. కరోనాను తుద ముట్టించేందుకు భారతీయులంతా ఒక్కటయ్యారన్న సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదామన్నారు. అందరూ ఒక్కటై వెలుగులు నింపి… కరోనాను అంతమొందించాలని పిలుపునిచ్చారు చిరు.

Tags: Chiranjeevi, Nagarjuna, Tollywood, modi, CoronaVirus, Covid 19

Advertisement

Next Story

Most Viewed