- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"మిమ్మీ" పాట కావాలంటూ మారాం చేస్తున్న చిరు మనవరాలు
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ను తనదైన స్టైల్ లో యూజ్ చేస్తున్నాడు. బర్త్ డే విషెస్, స్పెషల్ డేస్ గురించి అభిమానులతో పంచుకుంటూనే…. సమాజంలో బాధ్యతగల ప్రముఖుడిగా ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తున్నా డు. ఇతరులు సమాజానికి ఉపయోగపడే పని చేస్తే… తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ అభినందిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మీకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా అంటూ ట్వీట్ చేశాడు చిరు. షూటింగ్ టైంలో పాట మొత్తం వినేందుకు ఇష్ట పడతాను. ఆ పాట వింటున్నప్పుడు ఎలాంటి బ్రేక్స్ ఉండేందుకు ఇష్టపడను. కానీ ఈ మధ్య ఒక సాంగ్ వింటున్నప్పుడు మధ్యలో ఆపేయడం, మళ్లీ మొదటి నుంచి వినడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. కారణం ఏంటో రేపు చెప్తా అంటూ ట్వీట్ చేసిన చిరు… కారణం నా మనవరాలు, శ్రీజ కూతురు నవిష్క అంటూ మంగళవారం ఉదయం సీక్రెట్ రివీల్ చేశాడు.
అసలు విషయం ఏంటంటే… ఖైదీ నం. 150 సినిమాలోని మిమ్మీ మిమిమ్మి సాంగ్ అంటే చిన్నారి నవిష్కకు ఇష్టం. ఏం సాంగ్ పెట్టాలి అని అడిగితే మిమ్మి అంటూ క్యూట్ గా చెప్తోంది. పాట పెట్టగానే ఆనందంతో పాట పాడుతూ, తాత చిరు ఒడిలోనే చిన్నగా స్టెప్స్ కూడా వేస్తున్న నవిష్క … పాట ఆపేయగానే ఏడుస్తూ మారాం చేస్తుంది. ఎందుకు ఆపావ్ అని… మళ్లీ పాట పెట్టాలని తాతను అడుగుతోంది. దీంతో చిరు పాట మళ్లీ పెట్టగా హాయిగా మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తోంది. దీంతో ఆ పాటను ఎంజాయ్ చేస్తున్న నవిష్కను చూసి మురిసిపోతున్న చిరు… సంగీతానికి ఉన్న శక్తిని చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటానని తెలిపాడు. ఏడాది పాప సంగీతాన్ని ఆస్వాదిస్తూ, డాన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది అని… తనకు పాట అంటే ఎంత ఇష్టమో తెలుసుకునేందుకే పాటను పాజ్ చేస్తూ, రీ ప్లే చేస్తున్నానని తెలిపాడు. ఇక పాట నాదే కాబట్టి అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాదే అన్నాడు మెగా మనవరాలి తాత మెగాస్టార్.
Always amazed @ the power of music.Just over 1 yr & how this little kid enjoyed music & tried doing dance moves is sheer bliss.Paused & played music 2 see she was really loving it.పాట నాది కాబట్టి,అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే😄 #PreLockdownMoments #Throwbackvideo #navishka_k pic.twitter.com/znNOyMY0MB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 28, 2020
Tags: Chiranjeevi, Khaidi No. 150, Mimmi Mimmi Mi Song, Navishka, Tollywood