‘మై అప్పా.. మై ఆచార్య’.. చిరుకు స్పెషల్ విషెస్ చెప్పిన చెర్రీ

by Shyam |   ( Updated:2021-08-22 01:49:55.0  )
‘మై అప్పా.. మై ఆచార్య’.. చిరుకు స్పెషల్ విషెస్ చెప్పిన చెర్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోతున్నాయి. సోషల్ మీడియాలో సినీ రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు చిరుకు బర్త్ విషెస్ తెలుపుతున్నారు. ఇఙ్కా మెగా అభిమానులకు ఈరోజు పండగే అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే మెగా హీరోలందరూ చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు తమదైన శైలిలో చెప్పి ఆశ్చర్యపరిచారు. తాజాగా మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి విన్నూతంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరు, చెర్రీ గురు- శిష్యులు గా కనిపించనున్నారు. కాగా, ఈ సెట్ లో తీసిన కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ని అన్ని కలిపి ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశాడు.

తన తండ్రితో కలిసి సెట్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో చిరుతో పాటు చరణ్ సెట్స్ కి వెళ్లడం, ఆయన దగ్గరుండి చరణ్ కి మెళుకువలు నేర్పడం, చరణ్ తండ్రి మాటలను శ్రద్దగా వినడం కనిపిస్తున్నది. ఇక ఈ వీడియో పోస్ట్ చేస్తూ చెర్రీ ‘నేను అప్పా అని ప్రేమగా పిలిచే మా ఆచార్యతో గడిపిన ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘మై అప్పా.. మై ఆచార్య’ అంటూ తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Advertisement

Next Story