భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం: చైనా

by vinod kumar |
భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం: చైనా
X

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా స్పందించింది. రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చైనా సుద్దులు చెబుతోంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ. తాము మోదీ ప్రసంగాన్ని నిశితంగా గమనించామన్నారు. తాము భారత్‌తో కలిసి పని చేయడాకి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ద్వైపాక్షిక సంబంధాలు శక్తివంతమైతేనే ఇరు దేశాలకు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉంటాయని.. అందుకు తాము కట్టుబడి ఉన్నామని చైనా ఉసరవెల్లి మాటలను వల్లె వేసింది. కాగా, మోదీ పంద్రాగస్టు సందర్భంగా ప్రసంగిస్తూ.. నియంత్రణ రేఖ నుంచి వాస్తవాధీన రేఖ వరకు తమ దేశ భూభాగంపై ఎవరైనా కన్నెత్తి చూస్తే.. భారత సాయుధ దళాలు తగిన రీతిలో సమాధానం చెబుతాయని పరోక్షంగా చైనాకు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed