- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనిల్ అంబానీ ఆస్తులపై చర్యలకు వారు సిద్ధం!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి మరోసారి చిక్కుల్లో పడ్డారు. అనిల్ అంబానీ నుంచి రావాల్సిన బకాయిల కోసం చైనా బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎక్స్ పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంకులు అనీల్ అంబానికి చెందిన అంతర్జాతీయ ఆస్తులపై హక్కులను పొందాలని భావిస్తున్నాయి. ఈ బ్యాంకులకు అనిల్ అంబానీ రూ. 5,276 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంది.
ఈ క్రమంలో ఆయన ఆస్తుల వివరాలను అంచనా వేయడానికి చైనా బ్యాంకులు సిద్ధమయ్యాయి. తమకు చిల్లిగవ్వ కూడా చెల్లించకుండా ఉండేందుకు అనిల్ అంబానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చైనా బ్యాంకుల ప్రతినిధి బంకిమ్ థాంకి చెప్పారు. తమకు రావాల్సిన రుణ బకాయిల కోసం చట్టపరమైన అన్ని రకాల మార్గాలను అనుసరిస్తామని, ప్రస్తుతం ఎస్‌బీఐ అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలపై సుప్రీంకోర్టును ఆశ్రయించినందున, చైనా బ్యాంకుల చర్యలకు అడ్డంకులు ఉండవని భావిస్తున్నట్టు ప్రతినిధి వివరించారు.
కాగా, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) అనిల్ వ్యక్తిగత హామీతో చైనా బ్యాంకుల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది. తర్వాతి పరిణామాల్లో రుణాలను చెల్లించడంలో సంస్థ విఫలమైంది. దీంతో ఈ బకాయిలపై కోర్టుకెళ్లగా మేలో చైనా బ్యాంకులకు రూ. 5,226 కోట్లను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం అనిల్ అంబానీ బకాయిలను చెల్లించే స్థితిలో లేనని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా బ్యాంకులు చట్టపరమైన చర్యలకోసం సిద్ధమవుతున్నాయి.