- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడేళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్
బీజింగ్: థర్డ్ వేవ్‌తో పిల్లలకు ముప్పు ఉందన్న వాదనల నేపథ్యంలో చైనా కీలక ముందడుగు వేసింది. మూడేళ్ల పిల్లలకు టీకా వేయడానికి సంసిద్ధమవుతున్నది. ఇప్పటికే సినోవాక్ అనే టీకాను మూడేళ్ల నంచి 17ఏళ్ల పిల్లలకు వేయడానికి అత్యవసర వినియోగానికి అనుమతించింది. తద్వారా మూడేళ్ల పిల్లలకు టీకాను అనుమతించిన తొలి దేశంగా నిలిచింది. సినోవాక్ ఫార్మా సంస్థ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుందన్న దానిపై స్పష్టతనివ్వలేదు. దేశ అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా నేషనల్ హెల్త్ కమిషన్ షెడ్యూల్ ఖరారు చేస్తుందని వివరించారు. ఈ కంపెనీ చిన్నపిల్లలపై తొలి దశ ప్రయోగాలను పూర్తి చేసింది. ఫలితాలను త్వరలోనే లాన్సెట్‌లో ప్రచురించనుంది.
ఈ టీకాను మూడేళ్ల నుంచి 17 ఏళ్ల పిల్లలకు వేయడానికి ఆమోదం లభించిందని, టీకా సేఫ్టీ, సామర్థ్యాలు నిర్ధారణ అయ్యాయని ఓ ప్రభుత్వాధికారి పేర్కొన్నారు. కాగా, చైనాకు చెందిన మరో దిగ్గజ ఫార్మా కంపెనీ సినోఫామ్ కూడా పిల్లల్లో తమ టీకా సత్ఫలితాలనిస్తున్నదని పేర్కొన్నారు. కానీ, టీకాకు ఆమోదం లభించిందా? లేదా? అనే విషయాన్ని వెల్లడించలేదు. తొలిసారి కరోనా వెలుగుచూసి ప్రపంచానికి భయకంపితం చేసిన చైనాలో మహమ్మారి అదుపులోకి వచ్చింది. నెమ్మదిగా టీకా పంపిణీ ప్రారంభించినా సుమారు 77 కోట్ల డోసులను పంపిణీ చేసింది. ఈ ఏడాది చివరినాటికి 70శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చైనా అధికారవర్గాలు తెలిపాయి.