మొదటిసారి అమెరికాను దాటేసిన చైనా.. ఏ విషయంలో?

by vinod kumar |
మొదటిసారి అమెరికాను దాటేసిన చైనా.. ఏ విషయంలో?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మరణాల్లో చైనాను అమెరికా దాటేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విడుదల చేసిన వార్షిక నివేదికలో గతేడాది అంతర్జాతీయ పేటెంట్లను ఫైల్ చేసిన దేశంగా చైనా, అమెరికాను దాటేసింది. మొత్తంగా 2,65,800ల అంతర్జాతీయ పేటెంట్లను చైనా ఫైల్ చేసిందని డబ్ల్యూఐపీఓ తెలిపింది. పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీలో మొదటిసారిగా చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో మొత్తంగా 58,990 దరఖాస్తులను చైనా పంపింది. ఇదే కేటగిరీలో అమెరికా కేవలం 57,840 దరఖాస్తులను పంపింది. 1978 నుంచి ఇప్పటివరకు మొదటిస్థానంలో ఉన్న అమెరికాను వెనక్కినెట్టి చైనా రికార్డు సృష్టించింది.

ఈసారి ఆసియా నుంచి దాదాపు 52.4 శాతం అప్లికేషన్లు అందినట్టు డబ్ల్యూఐపీఓ ప్రకటించింది. అలాగే చైనాకు చెందిన టెలికాం కంపెనీ హువాయి టెక్నాలజీ 4411 దరఖాస్తులతో వరుసగా మూడో సారి ఎక్కువ అప్లికేషన్లు వేసిన కంపెనీగా నిలిచింది. తరువాతి స్థానాల్లో జపాన్‌కి చెందిన మిట్సుబుషి ఎలక్ట్రానిక్స్, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ నిలిచాయి.

Tags: Patents, WIPO, Intellectual property rights, China, America

Advertisement

Next Story

Most Viewed