చైనా, రష్యా మా మిత్రులు: తాలిబన్లు

by vinod kumar |   ( Updated:2021-08-25 09:32:27.0  )
taliban-putinen
X

దిశ వెబ్‌డెస్క్: రష్యా, చైనాతో సంబంధాలు ఇప్పటికి కొనసాగుతున్నాయని తాలిబన్లు ప్రకటించారు. బీరూట్ వేదికగా ఉన్న అల్ మయాదమ్ టీవీ చానల్‌తో వారు మాట్లాడారు. తాము ఇప్పటికి పొరుగు దేశమైన చైనా, రష్యాతో మంచి సంబంధాలను నెలకొల్పామని తెలిపారు. వాటితో పాటు ఉజ్భెకిస్తాన్, ఇరాన్, తజికిస్తాన్ దేశాలతో సైతం ఇదే తరహ వాతావరణాన్ని కోరుకుంటున్నామని అన్నారు. తమను ఇప్పటికి పశ్చిమ దేశాలు గుర్తించటం లేదని, అయితే వారి మద్ధతను సైతం పొందుతామని ధీమా వ్యక్తం చేశారు.

అయితే రష్యా ఇప్పటికే యూరోపియన్ దేశాలకు తాలిబన్ల విషయంలో గట్టి వార్నింగ్ ఇచ్చింది. మీరు చేసిన తప్పులకు మధ్యాసియా దేశాలు కూడా ఉగ్రవాదం, మత ఛాందసవాదం బారీన పడే అవకాశాలున్నట్లు హెచ్చరించింది. పరిస్థితులను అస్తవ్యస్తంగా మారిపోవటంతో పుతిన్ ఈ విధంగా స్పందించారు. అయితే మాతో మంచి సంబంధాలున్న మాత్రాన టెర్రరిస్ట్ జాబితా నుంచి తాలిబన్లను ఎప్పుడు తొలగించబోమని మాస్కో వెల్లడించింది. పూర్తిగా వివరాలు కనుగొని, పాలన విధానాలు చూశాకనే ఓ నిర్ణయానికి వస్తామని తెలిపింది. ఇవి నిజమని తెలపడానికి కాబూల్‌లోని తన రాయబార కార్యాలయంలో చాలామటుకు సిబ్బందిని రష్యా తొలగించలేదు. చైనా కూడా రష్యా దారిలో నడుస్తున్నట్లు సంకేతాలు అందించింది. తమ రాయబారులను, ఇతర సిబ్బందిని కూడా అలాగే విధుల్లో ఉంచింది.

Advertisement

Next Story

Most Viewed