ప్రధాని పర్యటనపై చైనా అభ్యంతరం

by  |
ప్రధాని పర్యటనపై చైనా అభ్యంతరం
X

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ లడాఖ్ పర్యటనపై చైనా స్పందించింది. సరిహద్దులో ఉద్రిక్తతలను ఎగదోసే చర్యలకూ ఎవ్వరూ పూనుకోవద్దని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. చైనాపట్ల భారత్ వ్యూహాత్మక తప్పుడు అంచనాలు వేసుకోవద్దని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. భారత్, చైనాలు చర్చలు నిర్వహిస్తున్నాయని, సరిహద్దులో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు మిలిటరీ, దౌత్యమార్గాల్లో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కాబట్టి ఎవ్వరూ ఉద్రిక్తతలను పెంచిపోషించే పనులు చేయకూడదని సూచించారు.

ఇరుదేశాల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి

భారత రోడ్ల నిర్మాణంలో చైనా కంపెనీలను బ్యాన్ చేయాలన్న ఆలోచన గురించి ప్రశ్నించగా, ఇండియా ద్వైపాక్షిక సంబంధాలు, ఇరుదేశాల సంయుక్త ప్రయోజనాలపై దృష్టిపెట్టాలని లిజియన్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు దిగజారే విధంగా భారత్‌లో కొందరు రాజకీయనేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, కానీ, రెండు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇండియా కూడా కలిసి నడవాలని చెప్పారు. ఇటువంటి నిర్ణయాలతో భారత్ కూడా నష్టపోతుందని, ఇండియాలో చైనీస్ కంపెనీల వ్యాపారానికి సంబంధించిన చట్టబద్ధ హక్కుల కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరుదేశాలు పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ మద్దతుగా నిలవాలని భావిస్తున్నట్టు వివరించారు.


Next Story

Most Viewed