- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోన్ యాప్ కేసులో చైనా వ్యక్తి అరెస్టు
దిశ, క్రైమ్ బ్యూరో : లోన్ యాప్ కేసులో ఇండియా నుంచి పరారీ అవుతుండగా చైనాకు చెందిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. ఆగ్లో టెక్నాలజీస్, లియుఫాంగ్ టెక్నాలజీస్, నాబ్లూమ్ టెక్నాలజీస్, పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ పేర్లతో చైనాకు చెందిన లాంబో (27) అనే వ్యక్తి లోన్ యాప్‌లు నిర్వహిస్తున్నట్టు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ కంపెనీల ద్వారా దాదాపు 150 యాప్స్ ద్వారా 6 నెలల్లో రూ.21 వేల కోట్ల లావాదేవీలను జరిపినట్టు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం హైదరాబాద్ లోన్ యాప్స్‌పై పోలీసుల కఠిన చర్యల నేపథ్యంలో చైనాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అతన్ని అరెస్టు చేశారు. అంతే కాకుండా లాంబోకు సహకరిస్తున్న నాగరాజు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్టు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అవినాష్ మహాంతి తెలిపారు. చైనీస్ భారతీయుడు యువాన్ యువాన్ @ సిస్సీ @ జెన్నిఫర్ ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించినట్టు పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం అతను విదేశాలలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, నిధుల మళ్లింపుపై కేంద్రానికి సమాచారం ఇచ్చినట్టు సీసీఎస్ పోలీసులు తెలిపారు.