చైనా మరో దురాక్రమణ.. మన భూభాగం ఇప్పుడు..

by Anukaran |   ( Updated:2021-11-10 01:48:34.0  )
చైనా మరో దురాక్రమణ.. మన భూభాగం ఇప్పుడు..
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా దురాక్రమణ మరో సారి బయటపడింది. భారత్ భూభాగంలో ఏకంగా గ్రామాన్నే నిర్మించి తన దుష్టపన్నాగాన్ని బయట పెట్టింది. అయితే అమెరికా చెప్పేంత వరకూ మన దేశానికి ఆ విషయమే తెలియదు. అమెరికా అంతర్గత నివేదిక వచ్చిన తర్వాత భారత్ అధ్యాయనం చేసి నిర్దారించుకుంది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఆక్రమణలు జరిగాయి అని ఆరా తీస్తున్నాయి. వివాదాస్పద అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగంలో ఈ నిర్మాణాలు జరిగాయి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలో ఉంచుకుంది. అయితే శాటిలైట్ ద్వారా ఈ ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్నట్టు అమెరికా వర్గాలు గుర్తించాయి. ఒకప్పుడు భారత్ అస్సాం రైఫిల్స్ పోస్ట్ ను 1959 లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆక్రమించుకుంది. అప్పట్లో దీన్ని లాంగ్జూ ఘటనగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా కనుసన్నల్లో ఉంటూ వస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed