చైనా బయటకు చెప్పుకోలేని తప్పు చేసుంటుంది : ట్రంప్

by vinod kumar |
చైనా బయటకు చెప్పుకోలేని తప్పు చేసుంటుంది : ట్రంప్
X

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ పుట్టుకపై మరోసారి చైనా వైపు వేలెత్తి చూపారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ వైరస్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో చైనా ఏదో ఘోరమైన పొరపాటు చేసి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చైనా తప్పిదమో లేక నిర్లక్ష్యమో కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోతోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా చేసిన తప్పిదానికి యావత్ ప్రపంచం బాధపడుతోందని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్‌ను గుర్తించిన తర్వాత ఏదో ఒక దశలో నియంత్రించే వీలున్నా చైనా అలా చేయలేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను దాని మూలం వద్దే నిలిపివేసే అవకాశం ఉన్నా.. ఏదో తప్పు మాత్రం జరిగిందని ట్రంప్ అన్నారు. దీనిపై లోతైన విచారణ జరిగితే కాని అసలు వాస్తవాలు వెలుగులోనికి రావని ట్రంప్ స్పష్టం చేశారు.

Tags: Donald Trump, China, Wuhan Lab, Coronavirus, Covid 19

Advertisement

Next Story