వూహాన్ ప్రయోగశాలపై మరింత ‘క్లారిటీనిచ్చిన చైనా’

by vinod kumar |
వూహాన్ ప్రయోగశాలపై మరింత ‘క్లారిటీనిచ్చిన చైనా’
X

బీజింగ్ : కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌ వైరాలజీ ల్యాబ్ నుంచే పుట్టిందని గత కొన్ని వారాలుగా అమెరికా వాదిస్తూ వస్తోంది. చైనా నిర్లక్ష్యం కారణంగానే వూహాన్‌లో జన్మించిన వైరస్ బయటకు పాకిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా మంత్రి మైక్ పాంపియో ఆరోపిస్తున్నారు. దీనిపై చైనా మరోసారి క్లారిటీనిచ్చింది. ‘వూహాన్‌లోని ప్రయోగశాల కేవలం చైనా సొంతం కాదని, ఇది చైనా-ఫ్రాన్స్ భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రయోగశాలని స్పష్టం చేసింది. ఈ ప్రయోగశాలలో పని చేస్తున్న ఫస్ట్ బ్యాచ్ సిబ్బంది అంతా ఫ్రాన్స్‌లో శిక్షణ పొందిన వాళ్లేనని చెప్పింది. పీ4 వూహాన్ వైరాలజీ ల్యాబ్స్ సినో-ఫ్రెంచ్ సహకార ప్రాజెక్టనే విషయం అమెరికాకు ఇంకా తెలియదా’ అని ఎద్దేవా చేసింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలు పాటించామని.. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలు ప్రతీ ఏట వుహాన్ ల్యాబ్‌లోని పరికరాలను పరీక్షిస్తుంటాయని.. వారి అనుమతి తర్వాతే ప్రాజెక్టు నడుస్తుంటుందని చైనా వివరించింది. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అమెరికా మరిన్ని అబద్దాలు చెబుతోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్ విమర్శించారు. ఒకవేళ తమ వాదనే నిజమని భావిస్తే వెంటనే తగిన సాక్ష్యాలను చూపించాలని చునియింగ్ డిమాండ్ చేశారు.

Mike Pampio, Donald Trump, China, France, Collaberation, Wuhan Viralogy Lab

Advertisement

Next Story