రోహిత్ శర్మకు కోచ్‌ వార్నింగ్

by Shyam |
rohith sharma
X

దిశ, స్పోర్ట్స్ : పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే టెస్టు క్రికెట్‌లో మాత్రం రోహిత్ ఇంకా పూర్తి స్థాయిలో పరిణితి చెందలేదు. భారత జట్టు త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్ సహా ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు ఆడనున్నది. ఇది రోహిత్ శర్మ కెరీర్‌లో అత్యంత కీలకమైన పర్యటన అని అతడి చిన్ననాటి కోచ్‌ దినేశ్ లాడ్ అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రోహిత్‌కు ఒక వార్నింగ్ ఇచ్చారు.

రోహిత్ చివరిసారిగా 2014లో ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పుడు నెంబర్ 6వ స్థానంలో రోహిత్ బ్యాటింగ్ చేశాడు. అయితే టెస్టుల్లో 2019 నుంచి అతడు ఓపెనర్‌గా దిగుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ మరింత ఓపికగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉందని లాడ్ అంటున్నాడు. ‘ఆస్ట్రేలియాలో రోహిత్ బ్యాటింగ్ తీరును అందరూ గమనించారు. అతడు షాట్లను ఎంచుకునే తీరు వల్ల పేసర్లను సరిగా ఎదుర్కోగలిగాడు. అతడి ఆట తీరు చూస్తే వికెట్ పారేసుకునేలా కనిపించలేదు. అయితే హఠాత్తుగా ఒక చెత్త షాట్ ఆడి అవుట్ అవుతున్నాడు. ఈ విషయాన్ని అతడు గ్రహించాలి. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అలాంటి షాట్లు ఆడి జట్టును ప్రమాదంలో పడేయవద్దు’ అని దినేశ్ లాడ్ తన శిష్యుడు రోహిత్‌ను హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed