స్టార్ హీరో ఫామ్ హౌస్ లో దారుణం.. పదేళ్ల చిన్నారిని అనుభవించి..

by Anukaran |   ( Updated:2021-09-21 01:31:59.0  )
స్టార్ హీరో ఫామ్ హౌస్ లో దారుణం.. పదేళ్ల చిన్నారిని అనుభవించి..
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కామాంధుల కన్ను పడుతోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను కామవాంఛతో రగిలిపోతున్న మృగాళ్లు చిదిమేస్తున్నారు. తాజాగా ఒక సినీ నటుడి ఫామ్ హౌస్ లో చిన్నారిపై అఘాయిత్యం జరిగిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసి సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే.. ఒక కన్నడ సినీ నటుడికి టీ నరసీపుర తాలూకా కెంపయ్యనహుండిలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ హౌస్ లో ఆ నటుడు ఎప్పుడైనా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి వస్తాడు. మిగతా అన్నిరోజులు ఆ ఫామ్ హౌస్ ని శివమొగ్గకు చెందిన భార్యాభర్తలే చూసుకొంటారు. ఆ హౌస్ ని చూసుకొంటూ అక్కడే నివసిస్తున్నారు. వారికి ఒక పదేళ్ల పాప ఉంది. గత కొద్దికాలంగా ఆ చిన్నారిపై స్థానికంగా నివాసముండే నిజాం(25) అనే యువకుడు కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16 న తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఫామ్ హౌస్ కి వెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

బాలికను బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఆమెను బెదిరింపులకు గురి చేసి పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలోనే బాలిక కొన్నిరోజుల నుంచి ముభావంగా ఉండడంతో ఆమె తల్లి నిలదీసింది. దీంతో జరిగిన విషయం మొత్తం బాలిక, తల్లిదండ్రులకు తెలపడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లుగా జిల్లా ఎస్పీ ఆర్ చేతన్ ప్రకటించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

బిగ్ బాస్ లో అరాచకం: అర్ధరాత్రి బాత్రూమ్ లో లహరి రొమాన్స్.. ప్రియా ఆంటీ డర్టీ టాక్

బిగ్ బాస్ లో అరాచకం: అర్ధరాత్రి బాత్రూమ్ లో లహరి రొమాన్స్.. ప్రియా ఆంటీ డర్టీ టాక్

Advertisement

Next Story