- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాణ రంగానికి ప్రభుత్వ సహకారం : సీఎస్
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో నిర్మాణ రంగానికి సంబంధించి అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర యంత్రాంగం అందిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ డెవలపర్లు తమకు అవసరమైన వస్తు సామగ్రిని సమకూర్చుకోవడంతో పాటు కార్మికులతో నిర్మాణపు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. బీఆర్‌కే భవన్ నుంచి క్రెడాయ్, ట్రెడాయ్ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వలస కార్మికుల్లో విశ్వాసం కలిగించాలని, ప్రోత్సాహకాలు, సౌకర్యాలు, వైద్య సంరక్షణ అందించాలని బిల్డర్లను సీఎస్ కోరారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బిల్డర్ల కోరిక మేరకు భవన నిర్మాణ సామగ్రి సరఫరాలో ఎటువంటి అంతరాయాలు ఏర్పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీనిచ్చారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శులు అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, డైరెక్టర్ సి.సి.ఎల్.ఎ రజత్ కుమార్ షైనీ, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Telangana, Credai,Credai,Teleconference