- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ కి శరణార్థిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మయన్మార్‌లో ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ పార్టీని అడ్డుకొని సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. సైనిక పాలకుల దాష్టికంతో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఇంకొంతమంది ప్రాణ భయంతో పక్క దేశాలకు పారిపోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున మయన్మార్‌కు చెందిన ప్రముఖులు, ప్రజలు, అధికారులు ఇండియాకు శరణార్థులుగా వస్తున్నారు. ఇప్పటీకే చాలామంది ఇండియాలో శరణార్థి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం భారత్ కి శరణార్థి గా వచ్చారు. మయన్మార్‌లోని చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలై లియన్ లుయై మిజోరాంలోని చంపై జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో శరణార్థిగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దాదాపు 20 మంది మయన్మార్ ప్రజాప్రతినిధులు భారత్‌లో శరణార్థులుగా ఆశ్రయం పొందుతున్నారు.